ఘనంగా ప్రారంభమైన బొట్టవానిపాలెం (బి.వి.పి.) ప్రీమియర్ లీగ్ సీజన్-4 క్రికెట్ పోటీలు.
అభివృద్ధికి దిక్సూచి యువత. స్నేహ భావాన్ని పెంపొందించుకొని సన్మార్గంలో నడవాలి.
5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత.
మధురవాడ :వి న్యూస్ (జనవరి14):
స్నేహ భావాన్ని పెంపొందించేవి క్రీడలేనని 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత అన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏడాదిలాగే బోట్టవానిపాలెం శివార్లలో నిర్వహిస్తున్న బొట్టవానిపాలెం ప్రీమియర్ లీగ్2024 పోటీలను ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. బొట్టవానిపాలెం కు చెందిన యువత ప్రతి ఒక్కరు సామాజిక స్ఫూర్తితో సంక్రాంతి పండుగ సమయంలో చెడు మార్గంలో వెళ్లకుండా క్రీడా స్ఫూర్తిని చాటడం శుభపరిణామమని ఆమె అన్నారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని తెలిపారు.14 నుండి17వ తారీకు వరకు సంక్రాంతి పండుగ నాలుగు రోజులు జరిగే ఈక్రికెట్ పోటీలలో స్థానిక 5జట్లు పోటీ పడుతున్నాయని, బి.వి.పి.ప్రీమియం లీగ్ నిర్వాహకులు మీడియాకు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర టీడీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు,భీమిలి టీడీపీ బీసీ సెల్ అధ్యక్షలు నమ్మి శ్రీను,ఈగలరవికుమార్,నమ్మి అప్పలస్వామి,దాసరి గోవిందా,నమ్మి సూర్య అప్పారావు,కొర్రాయి మంగరాజు,మెడబోయిన సూర్య మాస్టర్, ముగడ రమణ,దాసరి నాయుడు బాబు,కొర్రాయిసురేష్,ఇమంది అప్పలరాజు,నమ్మి పెద రమణ,బొట్ట సురేష్,కొర్రయి అప్పలస్వామి,ఈగల కిరణ్,ముగడ సత్యం,గౌతమి వెంకటి,బొట్ట అప్పలరాజు,బొట్ట కనకరాజు,నమ్మి చిన రమణ,దాసరి భాస్కరరావు మరియు బోట్టవానిపాలెం పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు.