పిఎం పాలెం, చంద్రం పాలెం ఉన్నత పాఠశాల వద్ద పాదచారుల వంతెన ఏర్పాటుకు 2.5కోట్ల రూపాయలతో అనుమతులు.
పిఎం పాలెం : వి న్యూస్ : జనవరి 10:
విశాఖ,పిఎం పాలెం, చంద్రం పాలెం ఉన్నత పాఠశాల వద్ద పాదచారుల వంతెన ఏర్పాటుకు అనుమతి మంజూరు అయ్యిందని సుమారు 2.5కోట్ల రూపాయలతో వంతెన ఏర్పాటుకు అనుమతులు లభించాయని 6వ వార్డ్ వైస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో తెలిపారు. పాదచారుల వంతెన ఏర్పాటు మంజూరుకు సహకరించిన మాజీ మంత్రి భీమిలి శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాస్ కి , విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, జీవిఎంసి కమిషనర్ సాయి కాంత్ వర్మకు 6వ వార్డు కార్పొరేటర్, జీవీఎంసీ విప్ డాక్టర్ ముత్తం శెట్టి లక్ష్మీ ప్రియాంక కృతజ్ఞతలు తెలిపారు.