అమలాపురంలో వినూత్నంగా ఆవు పిడకలతో 15వందల అడుగుల భోగి దండ ;
అమలాపురం (పెన్ షాట్ ప్రతినిధి) 14 జనవరి 2024;
భోగి పండుగ రోజున అమలాపురం గారపాటివారి వీధికి చెందిన కాలనీ వాసులు దాదాపు నెల రోజుల పాటు కష్టపడి ఆవుపేడతో పిడకలు చేసి సుమారు 15వందల అడుగుల బోగి దండను తయారు చేసి భోగి మంటల్లో వేసి సంబరాలు జరుపుకున్నారు.వీధిలోని వారంతా దాదాపు అరగంటసేపు దండను మోసుకుంటూ వచ్చి భోగి మంటలో వేసారు.ఈ సందర్భంగా గారపాటి వారి వీధికి చెందిన నల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ,ఆవుపేడతో మహిళలు నెల రోజులు ఎంతో కష్టపడి పిడకలు తయారు చేసి 15 వందల అడుగుల భోగి దండను తయారుచేసామని,గీతా మందిరం వారి సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరిగిందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గండి దేవీహారిక స్వామి,దంగేటి శ్రీహరి, తోరం రాము,తోరం బాలాజీ ఈశ్వరరావు, కోకా రాంబాబు, మురళీకృష్ణ, మెండా వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు.