చిప్పాడ పంచాయితీలో 1300 ఇళ్లకు శ్రీ రాముని అక్షింతలు వితరణ

చిప్పాడ పంచాయితీలో 1300 ఇళ్లకు శ్రీ రాముని అక్షింతలు వితరణ.

భీముని పట్నం: వి న్యూస్ (జనవరి 14):-

అయోధ్యలో 22 వ తేదీన శ్రీరామమందిరం ప్రాణప్రతిష్ట మహోత్సవాల్లో భాగంగా శ్రీ సుత్తమ్మ తల్లి భవానిపీఠం, విశ్వహిందూ పరిషత్ మరియు ఆర్.ఎస్. ఎస్ అధ్వర్యంలో చిప్పాడ పంచాయితీలో 1300 ఇళ్లకు అక్షింతలు వితరణ చేయడం జరిగింది - ఈ కార్యక్రమంలో ఆర్.ఎస్. ఎస్ , విశ్వహిందూ పరిషత్ సేవకులు మరియు చిప్పాడ పంచాయతీ శ్రీ సుత్తమ్మ తల్లి భక్తులు అందరూ పాల్గొన్నారు.