ఆనందపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వతరగతి ఉత్తమ ప్రతిభ విద్యార్థులకు ప్రోత్సాహకం అందించిన భీమిలి అసెంబ్లీ స్వతంత అభ్యర్థి నాగోతి నాగమణి.
ఆనందపురం : వి న్యూస్ : జనవరి 30:
మంగళవారం ఆనందపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భీమిలి అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి గత ఏడాది పదవ తరగతి మొదటి రెండవ స్థానాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు, వారిని అభినందిస్తూ నగదు ప్రోత్సాహకం అందించి మరియు వారి తల్లిదండ్రుల్ని సత్కరించారు,అదేవిధంగా పాటశాల ప్రధాన ఉపాధ్యాయులను అభినందిస్తూ వారిని సత్కరించారు. భీమిలి నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు,రాబోయే సార్వత్రిక ఎన్నికలలో గెలిచినట్లు అయితే ప్రతి ప్రభుత్వ పాటశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు ఉచితంగా బస్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.