శ్రీదేవి భూదేవి సమేత వైభవ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి దర్శనం.
మధురవాడ : పెన్ షాట్ ప్రతినిధి :డిసెంబర్ 23
డిసెంబర్ 23 మధురవాడ నగరంపాలెం రహదారిలో వెంచేసిఉన్న శ్రీదేవి భూదేవి సమేత వైభవ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్బంగా ఉత్తర ద్వార దర్శనం ద్వారా వెంకటేశ్వర స్వామి లక్ష్మీ దేవి, గోదాదేవి దర్శన భాగ్యం ఆలయ నిర్వాహకులు కల్పించారు. ఆలయంలో తెల్లవారు జామునుండి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కోలాటం బృందం ఆధ్వర్యంలో చిన్న పిల్లల కోలాటం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు చేసిన కోలాట నృత్యం భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి, కోలాట నృత్యం తిలకించిన భక్తులు చాలా చక్కగా సంస్కృతిక కోలాటం అద్భుతంగా చేసారంటూ కొనియాడారు.