మాలతాంబ విద్యానికేతన్ లో ఘనంగా గణిత మేథావి శ్రీనివాస రామానుజన్ జయంతి.
విద్యార్థుల వ్యూహాత్మకతకు విద్యార్థి దశ నుండే బీజం.
జీవీఎంసీ జోన్-2 కమిషనర్ కె.కనకమహాలక్ష్మి.
మధురవాడ: వి న్యూస్ : డిసెంబర్22:
ప్రముఖ గణిత మేథావి శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా గణిత విజ్ఞాన ప్రదర్శనను మాలతాంబ విద్యానికేతన్ విద్యార్థులు వైవిధ్యంగా నిర్వహించారు.విద్యార్థి దశ నుండే గణితం పై అవగాహన వలన చిన్నారుల మేధస్సుకు పదును పెట్టవచ్చని జీవీఎంసీ జోన్-2 కమిషనర్ కె.కనకమహాలక్ష్మి అన్నారు. శుక్రవారం కార్ షెడ్ కూడలి అంతర్జాతీయ క్రికెట్ మైదానం సమీపంలో గల మాలతాంబ విద్యానికేతన్ పాఠశాలలో నిర్వహించిన స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్(ఎస్.ఎల్.సి.)గణిత విజ్ఞాన ప్రదర్శన కార్యక్రమంలో విద్యార్థులు తమ ప్రతిభను చాటారు.వినూత్న నమూనాలను విద్యార్థులు ప్రదర్శించారు.ముఖ్యంగా మాక్ పార్లమెంట్,మాక్ ఎలక్షన్, కలకత్తా,ఢిల్లీ టూరిజం మరియు కల్చర్ ఈప్రదర్శనలో అలరించింది. ముఖ్య అతిథులుగా విచ్చేసిన జీవీఎంసీ జోన్-2 కమిషనర్ కె.కనకమహాలక్ష్మి, రిటైర్డ్ అడిషనల్ ఎస్.పి. టి.ఎస్.ఆర్. ప్రసాద్,ఎన్.ఐ.ఎఫ్ ఎస్. విద్యాసంస్థల అధినేత పాఠశాల చైర్మన్ సునీల్ మహంతి, జిల్లా బాస్కెట్-బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ వి హనుమంతరావు,జి.గోపాల్
విద్యార్థులు తయారు చేసిన నమూనాలను పరిశీలించారు. వారు తయారు చేసిన నమూనాలను ప్రదర్శిస్తూ అవి ఏ విధంగా పనిచేస్తాయని విశ్లేషణాత్మకంగా వివరణ ఇచ్చారు.ఈసందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. విద్యార్థుల వ్యూహాత్మకతకు విద్యార్థి దశ నుండే బీజం వెయ్యాలని,విద్యార్థుల మేధాశక్తికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని,శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ 22డిసెంబర్ 1887లో జన్మించారని,ఆయన జయంతి ని గణిత దినోత్సవంగా నిర్వహిస్తున్నామని అన్నారు.
ఆయన చిన్ననాటి నుండే గణితం పట్ల అవగాహన ఏర్పరుచుకున్నారని తెలిపారు. ఆయన విద్యార్థి దశ నుండి చేసిన కృషి వల్లే ప్రపంచం గర్వంచ దగ్గ గణితశాస్త్రవేత్తగా కొనియాడబడ్డారని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఏ.ఆదిమూర్తి, వైస్- ప్రిన్సిపాల్ బి.శ్రీదేవి,గణితం అధ్యాపకులు శ్రావణి,సహిన, సూర్యనారాయణ,పాఠశాల అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.