జాతర శిల్పారామంలో జరిగే వెలమ వనసమారాధనకు వెలమ కుటుంభ సభ్యులకు ఆహ్వాణం పలికిన గ్రేటర్ విశాఖ వెలమ సంక్షేమ సంఘం.
మధురవాడ : వి న్యూస్ : డిసెంబర్ 16
గ్రేటర్ విశాఖ వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు చలుమూరి నాయుడు బాబు ఆధ్వర్యంలో సంఘం సభ్యులు ఐటీ సెజ్ వద్ద కార్యాలయంలో సమావేశం అయ్యి డిసెంబర్ 24వ తేదీ జాతర శిల్పారామంలో నిర్వహించేందుకు నిచ్చయించారని అధ్యక్షులు చలుమూరి నాయుడు బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ గ్రేటర్ విశాఖ వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు చలుమూరి నాయుడు బాబు ఆధ్వర్యంలో మధురవాడ జాతర శిల్పారామంలో డిసెంబర్ 24వ తేదీ ఆదివారం నిర్వహిస్తున్న వన సమారాధనకు గ్రేటర్ పరిధి వెలమ సభ్యులందరూ కుటుంబ సమేతంగా పాల్గొని వెలమ వన సమారాధనను విజయవంతం చెయ్యాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమానికి వెలమ రాజకీయ నాయకులు, వెలమ పారిశ్రామిక వేత్తలు, వెలమ సినీ తారలు, అతిరద మహారదులు పాల్గొంటున్నారని తెలిపారు.