గంటా ఆధ్వర్యంలో యువ గళం ముగింపు సభకు ముమ్మర ఏర్పాట్లు
ఆనందపురం. వి న్యూస్ ప్రతినిధి : డిసెంబర్ 09
:తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు చేపడుతున్న యువగళం పాదయాత్ర డిసెంబర్ 17వ తేదీతో ముగియనుంది. ఈ ముగింపు సభ భీమిలి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. తగరపువలస సమీపంలో గల భూమాత లేఔట్ లో నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు వేములవలస ఉప సర్పంచ్, యువ నాయకుడు కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ తెలిపారు. ఈ బాధ్యతను మాజీ మంత్రి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కి అప్పగించారని అతని ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ సభలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు ఇరు పార్టీల అగ్ర నాయకులు హాజరవుతారని కావున ఉత్తర శాసనసభ్యులు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుండి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వచ్చే అవకాశం ఉందని ముందస్తుగా పక్కా ప్రణాళికతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా గంటా శ్రీనివాసరావు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు వేముల వలస ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు.