అంగన్ వాడీ సమస్యలు పరిష్కారం చేయండి. కొమ్మాధి గ్రామ ప్రజలు నిరసన

అంగన్ వాడీ సమస్యలు పరిష్కారం చేయండి. కొమ్మాధి గ్రామ ప్రజలు నిరసన

కొమ్మాధి : వి న్యూస్ :  డిసెంబర్ 19: 

ధరలు విపరీతంగా పెంచుతున్న వై యస్ ఆర్ సీ పీ ప్రభుత్వం అంగన్ వాడీ కార్మికుల వేతనాలు ఎందుకు పెంచరని కొమ్మాది గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంగన్వాడీ కార్మికు,సహాయకులు చేస్తున్న పోరాటానికి మద్దతు గా మంగళవారం కమ్మాధి గ్రామం అంగన్వాడీ కేంద్రం వద్ద కే వి పీ ఎస్ నాయకులు సియ్యాద్రి పైడి తల్లి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్ల కార్డులు ప్రదర్శిస్తూ,నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పైడి తల్లి మాట్లాడుతూ నేటికీ ఎనిమిది రోజులు గా అంగన్ వాడీ లు సమ్మె చేస్తున్న,కనీసం వారి సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నించకుండా ప్రభుత్వం,అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని, ఇది చాలా అన్యాయమని అన్నారు.అంగన్వాడీ కార్మికుల పై బెదిరింపులకు అధికారులు దిగడం అన్యాయమని అన్నారు.


వారు  అడుగుతున్నది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ నే కద అని తెలియ జేశారు.సమస్య పరిష్కారం చేయకుండా అంగన్వాడీ కేంద్రాల తాళాలును పగులగొట్టి,  సచివాలయం ఉద్యోగుల తో నడపడం ప్రభుత్వ నిరంకుశత్వం కు నిదర్శనమని అన్నారు. అంగన్ వాడీ కార్మికుల తో చర్చించి సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.తద్వారా సమ్మె విరమింప చేసి మా పిల్లలకు,ప్రజలకు అంగన్ వాడీ ద్వారా అందించే సేవలు ప్రారంభించాలని ప్రభుత్వానికి తెలియ జేశారు.ఈ కార్యక్రమంలో డి తులసమ్మ, ఎస్ నరసియ్యమ్మ,యు తాతారావు,కే ప్రతాప్,ఎస్ సాయి,ఎస్ అప్పారావు,సాదమ్మ,లక్ష్మీ తదితర గ్రామ ప్రజలు పాల్గొన్నారు.