గీతం పూర్వ విద్యార్ధుల సమ్మేళనం: హోమ్‌ కమింగ్‌లో పేరిట ఘనంగా ఉత్సవాలు

గీతం పూర్వ విద్యార్ధుల సమ్మేళనం: హోమ్‌ కమింగ్‌లో పేరిట ఘనంగా ఉత్సవాలు.

గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం: వి న్యూస్ : డిసెంబర్ 16: 

హోమ్‌ కమింగ్‌ పేరిట గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న పూర్వ విద్యార్ధుల సమ్మేళనాన్ని శనివారం గీతం అధ్యక్షుడు ఎమ్‌.శ్రీ భరత్‌ ప్రారంభించారు. దేశ విదేశాలలో నివాసం ఉంటున్న గీతం పూర్వ విద్యార్ధులు ఈ ఉత్సవాలకు పెద్దఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా గీతం అధ్యక్షుడు ఎమ్‌.శ్రీభరత్‌ గీతం ప్రగతిని, భవిష్య ప్రణాళికలను వివరించారు. పూర్వ విద్యార్ధులు గీతం ప్రగతిలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. గీతం కార్యదర్శి ఎమ్‌.భరద్వాజ, గీతం వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ దయానంద సిద్దవట్టం, ప్రోవైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ వై.గౌతమ్‌రావు, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ డి.గుణశేఖరన్‌, గీతం స్టూడెంట్‌ లైఫ్‌ డీన్‌ బాలాకుమార్‌, వివిధ కళాశాలల డీన్‌లు పాల్గొన్నారు. ఈ ఏడాది పూర్వ విద్యార్ధుల సమ్మేళనంలో ప్రముఖ సంస్థలలో ప్రతిభను చాటుతూ కీలక స్థానాలకు ఎదిగిన పలువురు గీతం పూర్వ విద్యార్ధులను అవార్డులతో సన్మానించారు. పారిశ్రామిక వేత్తగా ఎదిగిన గీతం పూర్వవిద్యార్ధి గౌతమ్‌సురాన, పరిశోధన మరియు నూతన ఆవిష్కరణల ద్వారా గీతం కు పేరు తెచ్చిన పూర్వ విద్యార్ధి సుజ్జిన్‌ అంగని, క్రీడలు మరియు సాంస్కృతిక రంగంలో రాణిస్తున్న పూర్వ విద్యార్ధి బి.హెచ్‌.గ్యారి, యువ ఆవిష్కర్తగా పేరొందిన మల్లవరపు సూర్యతేజ, మహిళ పారిశ్రామిక వేత్తగా గుర్తింపు పొందిన యార్లగడ్డ గీత, గీతం కు విశిష్ఠ సేవలు అందించిన ఓ.నరేష్‌ కుమార్‌, సేవారంగంలో రాణిస్తున్న వి.కె.వేణుగోపాల్‌లకు విశిష్ట పురస్కారాలను అందజేశారు. ఈ సమ్మేళనంలో భాగంగా విద్యార్ధుల సాంకేతిక ఉత్పత్తుల ప్రదర్శన, క్రీడా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. గీతం పూర్వ విద్యార్ధుల రాకతో ఇంజనీరింగ్‌, ఫార్మశీ, సైన్స్‌, మేనేజ్‌మెంట్‌, దంత వైద్య విభాగాలలో అధ్యాపకులతో ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహించారు. పూర్వ విద్యార్ధులు తమ కుటుంబ సభ్యులతో సహ హజరు కావడంతో గీతం ప్రాంగణంలో వినోదాన్ని పంచే స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. గత మూడు సంవత్సరాలుగా విశాఖ, హైదరాబాద్‌ ప్రాంగణాలలో క్రమం తప్పకుండా హోమ్‌కమింగ్‌ పేరిట కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని గీతం పూర్వవిద్యార్ధుల సంఘం డిప్యూటీ డైరక్టర్‌ పి.నవీన్‌ తెలిపారు.