హంసవన పుణ్యక్షేత్రం రామాద్రి దేవాలయంలో శివ పార్వతుల కళ్యాణం.
భీమిలి : పెన్ షాట్ ప్రతినిధి : డిసెంబర్ 08:
విశాఖపట్నం భీమిలి హంసవన పుణ్యక్షేత్రం రామాద్రి దేవాలయం ఆలయ చైర్మన్ డి ఆర్ కే రాజు ఆధ్వర్యంలో కార్తీక ఏకాదశి సందర్బంగా శివ పార్వతుల కళ్యాణం కార్యక్రమం అత్యంత వైభవంగా దేవాలయం ప్రధాన అర్చకులు సూర్యనారాయణ మూర్తి నిర్వహించారు. ఆలయ చైర్మన్ డి ఆర్ కే రాజు మాట్లాడుతూ ఆలయంలో ప్రతీ యేటా కార్తీక మాసం ప్రత్యేకంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామని అందులో భాగంగా మధురవాడ నుండి శ్రీ లక్ష్మీ నరసింహ కొళాటం బృందం సభ్యులు అత్యత్బుతంగా కోలాటం నృత్యం ప్రదర్శించారని తెలిపారు. శివ పార్వతుల కళ్యాణం అనంతరం కోలాటం బృందం గురువు సిరిపురపు సంతోషి ని దుషాలువా తో సత్కరించి బృందం సభ్యులందరిని అభినందించారు.