రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఇద్దరు గన్నవరం విద్యార్థులు ఎంపిక
కృష్ణా జిల్లా ; వి న్యూస్ ప్రతినిధి :డిసెంబర్ 24:
రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు గన్నవరం కు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికైనట్లు గన్నవరం నియోజక వర్గ క్రీడా సమన్వయ కర్త ధనియాల నాగరాజు శనివారం నాడు పత్రికలకు తెలిపారు. గన్నవరం బాలుర ఉన్నత పాఠశాల లో 9వ తరగతి చదువుతున్న డి. సుభాష్ కిరణ్,7వ తరగతి చదువుతున్న డి వెంకట్ లు జిల్లా స్థాయి హ్యాండ్ బాల్ పోటీలలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు నాగరాజు తెలిపారు. ఈ నెల 24,25తేదీలలో తెనాలిలో జరిగే జూనియర్ హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలలో కృష్ణా జిల్లా నుండి సుభాష్ వెంకట్ లు ప్రాతినిధ్యం వహిస్తారని నాగరాజు తెలిపారు. నైపుణ్యం చూపిన క్రీడాకారులను వీరిని ప్రోత్సహించిన నాగరాజు, ఆంజనేయులు లను గన్నవరం యం. పి. పి అనగాని రవి హాస్టల్ వార్డెన్ ప్రకాష్ అభినందించారు.