ప్రమాదం అంచుల్లో విద్యార్థులు
చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు.
మధురవాడ :వి న్యూస్ : డిసెంబర్ 22:
ప్రతిరోజు ఎక్కడో ఒకచోట విద్యార్థులు ప్రమాదాలకు గురవుతున్నారని వార్తలు వింటూనే ఉంటున్నాం. విద్యార్థుల కోసం ఎన్ని కథనాలు ప్రచురించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులులో మాత్రం మార్పు రావడం లేదు. ఇదే తరహాలో భీమిలి నియోజకవర్గం చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం సమయంలో విద్యార్థులందరికీ భోజనం చేయడానికి సరైన వసతులు లేకపోవడంతో నిర్మాణంలో ఉన్న ఒక భవనం పైకి వెళ్లి భోజనం చేస్తున్నారు. ఈ నిర్మాణంలో ఉన్న భవనం చుట్టూ ఎటువంటి ప్రహరీ గోడ కూడా లేదు... ఈ నిర్మాణంలో ఉన్న భవనం పైకి ఎక్కి భోజనం చేసేటప్పుడు వాళ్లు ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విద్యార్థులు నిర్మాణంలో ఉన్న భవనం పైకి వెళ్లి భోజనాలు చేస్తున్న సరే పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చాలా నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ విద్యార్థులకు ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత అని పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు....