కష్ట జీవుల జెండా తొలగించిన సచివాలయం వద్ద ధర్నా.

కష్ట జీవుల జెండా తొలగించిన సచివాలయం వద్ద ధర్నా..

కొమ్మది :  వి న్యూస్ :  డిసెంబర్22:

సి ఐ టి యు జెండాను,సంఘం బోర్డును తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఐటీయు మధురవాడ జోన్ కమిటీ డిమాండ్ చేసింది.కార్మికులకు,కష్టజీవుల కు రక్షణగా,అందాగా ఉన్న ఎర్ర జెండా తోలగించినందుకు నిరసగా 5 వ వార్డులోగల 37 వ సచివాలయం వద్ద 

సి ఐ టి యు నాయకులు,సంఘం సభ్యులు బైటాయించి ధర్నా చేశారు.ఈ సందర్భంగా జెండా తొలగించిన  సచివాలయం ప్రణాళికా సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా సీఐటీయు జోన్ ప్రదాన కార్యదర్శి పీ రాజ్ కుమార్ మాట్లాడుతూ 

మధురవాడ ప్రాంతంలో సాయిరాం కాలనీ,మరికొన్ని కాలనీలలో నివసిస్తున్న భవన నిర్మాణ కార్మికులు శ్రీకృష్ణ భవన నిర్మాణ కార్మిక సంఘం ఏర్పాటు చేసుకున్నారని,వారు సి ఐ టీ యు కి అనుభందం గా ఉన్నారని తెలియ జేశారు.

రెండు నెలల క్రితం సాయి రామ్ కాలనీ,కొమ్మది బస్ స్టాప్ వెనక బాగాన,ఎస్ టీ బీ ఎల్ దియేటర్ సమీపంలో సీఐటీయు జెండా,సంఘం బోర్డు ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు.జెండా స్థాపించిన ప్రదేశంలో విపరీతమైన చెత్తతో,భూర్గందం వెద జల్లేదని తెలియ జేశారు.మొత్తం ఆ ప్రాంతం శుభ్రం చేసి,చెత్తను తరలించడం జరిగిందన్నారు.

కార్మికులు,కష్టజీవుల కు అండగా ఉండే జెండాను కనీసం తెలియపరచకుండా 37 వ సచివాలయం సిబ్బంది తొలగించారని,స్థంభాన్ని సైతం విరగ దీసారని  ఇది చాలా దుర్మార్గంగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు.ఇది కార్మికులను,కష్టజీవులను అవమానం చేయడమే అని అన్నారు.వందలాది ఫ్లెక్సీ బార్డులు,కటౌట్లు,ప్రతి కాలనీలో లెక్కలేనన్ని  జెండాలు ఉన్నాయని వాటికి లేని అభ్యంతరం,అడ్డంకులు ఎర్ర జెందాకే ఎందుకు వచ్చాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.తొలగించిన పూర్తిగా విరగొట్టిన జెండాను వారే నిర్మాణం చేయాలని కోరారు.లేకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని అన్నారు.

ఈకార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఏ లక్ష్మణరావు, సీఐటీయు కార్యకర్తలు, నాయకులు,జీ చిన్నారావు,జీ కిరణ్,పి లక్ష్మణరావు, ఏ సత్తిబాబు,కే రమణ, ఎం కంచయ్యా, ఏ నారాయణరావు.డి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.