మిచాంగ్ తుఫాను ప్రభావంతో నేల వాలిన వంట పొలాలు, తక్షణమేరైతులకు ఆర్థిక సాయం అందించాలని,విశాఖ జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్ డిమాండ్

మిచాంగ్ తుఫాను ప్రభావంతో నేల వాలిన వంట పొలాలు, తక్షణమేరైతులకు ఆర్థిక సాయం అందించాలని,విశాఖ జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్ డిమాండ్:-

భీమిలి: వి న్యూస్ : డిసెంబర్ 08

విశాఖ జిల్లాలో పద్మనాభం భీమిలి రూరల్ మండలంలలో విశాఖ జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు,పి.వి వి.ప్రసాదరావు పట్నాయక్, ఆధ్వర్యంలో విశాఖ జిల్లా కిసాన్ మోర్చ బృందం పర్యటించారు,ఈ సందర్భంగా ప్రసాదరావు పట్నాయక్ రైతులతో మాట్లాడుతూ,పద్మనాభం మండలంలో పాండ్రంగి, మునివానపాలెం,రెడ్డి పల్లి,చిన్న పురం కాకుండా ఈ మూడు మండలాల్లో పలు ప్రాంతాలలోని వరి, రైతులను మిచాంగ్ తుఫాన్ నిలువునా ముంచేసింది అని తుఫాన్ ప్రభావంతో వరి పంట రాలిపోయాయి.పద్మనాభం మండలంలో చిన్నపురం లో పెసలు మినుములు పూర్తిగా నీటిలో మునిగాయని నీటిలో మునిగిన దాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్. ఈ తుఫాను ప్రభావంతో వరి రైతుల నేల మట్టం కావడంతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారయ్యింది. రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అన్ని విధాల ఆదుకోవాలని, తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు, పద్మనాభం మండల పార్టీ అధ్యక్షులు రెడ్డి పల్లి శ్రీనివాసరావు,ప్రధాన కార్యదర్శి మహంతి అప్పల రమణ(శ్రీను ) రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఉప్పాడ అప్పారావు విశాఖ జిల్లా కిసాన్ మోర్చ ఉపాధ్యక్షులు సారిక ప్రకాశ్,కిసాన్ మోర్చ కార్యదర్శులు:- కలగళ్ళ పేర్రాజు, పాoడ్రంగి కృష్ణా, మహంతి సీతమ్మ,మచ్చరాము, చందక జట్లయ్య మరియు మండల కిసాన్ మోర్ఛ నాయకులు,రైతులు పాల్గొన్నారు.