తగరపువలస జాతీయ రహదారిపై అంగన్వాఢీ నిరసన సెగ : భీమిలి

తగరపువలస జాతీయ రహదారిపై  అంగన్వాఢీ నిరసన సెగ : భీమిలి 

తగరపువలస:  వి న్యూస్ :  డిసెంబర్22:

అంగన్వాడిల నిరసన సెగలో భాగంగా భీమిలి నియోజకవర్గం తగరపువలస జాతీయ రహదారిపై చేపట్టిన నిరసనతో ఉద్యోగులు పోలీసుల మద్య ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు అరెస్టు చేసి భీమిలి స్టేషన్ కి తరలించి అనంతరం విడుదల చేసారు. నిరసనలో భాగంగా భీమిలి జనసేన పార్టీ నియోజకవర్గ మహిళ నాయకురాలు బొండపల్లి దేవి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం జగనన్న ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చేక నెరవేర్చలేదు అని ప్రశ్నించారు. అంగన్వాడి ఉద్యోగులకు కనీస వేతనం ఇస్తానని చెప్పి మోసం చేసిన తీరుని మీడియాకు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో భీమిలి కార్మిక సంఘాల నాయకులు మూర్తి, నర్సింగరావు, కార్మిక సంఘాల మహిళ నాయకులు, మరియు జనసేన నాయకులు శంకర్ రెడ్డి, రాజు నవిరి, శ్రీను కొయ్య, సతీష్ రామోజీ, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.