జీసస్ మానవుడిగా జన్మించిన రోజు క్రిస్మస్..ఉండి నియోజకవర్గం వైస్సార్సీపీ బీసీ సోషల్ మీడియా కన్వినర్ అరివెల్లి బలరాముడు:

జీసస్ మానవుడిగా జన్మించిన రోజు క్రిస్మస్..ఉండి  నియోజకవర్గం వైస్సార్సీపీ  బీసీ సోషల్ మీడియా కన్వినర్ అరివెల్లి బలరాముడు:

పశ్చిమ గోదావరి ఉండి: వి న్యూస్ : డిసెంబర్ 24: 


దైవ కుమారుడు జీసస్ మానవుడిగా జన్మించిన రోజును ప్రపంచమంతా క్రిస్మస్ గా జరుపుకుంటున్నామని, క్రిస్మస్ అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, అది మనిషిని నిరంతరం సన్మార్గంలో నడిపించే దైవికమైన ఒక భావన అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉండి నియోజక వర్గ బీసీ సంఘం సోషల్ మీడియా కన్వీనర్ అరివెల్లి బలరాముడు అన్నారు. క్రీస్తు జన్మించి నేటికీ 2 వేల ఏళ్ళు దాటిన కరుణామయుడుగా క్రైస్తవుల ఆరాధనలను అందుకుంటున్నారని అన్నారు. దుర్మార్గం నుంచి సన్మార్గానికి ,అమానుసత్వం నుంచి మానవత్వానికి,చెడు నుంచి మంచికి,దురాశ నుంచి దాతృత్వం త్యాగాలకు జీసస్ తన జీవితం ద్వారా బాటలు వేశారని, క్రీస్తు దయ కృపా తో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని బలరాముడు అన్నారు.సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహయుల పట్ల కరుణ,ఆకాశమంత సహనం,అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమాగుణం ఇవి జీసస్ తన జీవితం ద్వారా మనకు ఇచ్చిన సందేశాలనీ,అదే విధంగా ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్న జగనన్న ప్రభుత్వాన్ని,డిసిసిబి చైర్మన్ పివియల్ నరసింహరాజును ఆ జీసస్ దయతో కరుణను చూపించాలని బలరాముడు ఆ క్రీస్తును కోరారు.ఈ సందర్బంగా రాష్ట్ర ప్రజలు ప్రతీ ఒక్కరికీ తన హృదయపూర్వక శుభాకాంక్షలు బలరాముడు తెలిపారు.