పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలి లేకుంటే పోరాటం ఉదృతం చేస్తాం.. పేదవాడి నడ్డి విరిచే ప్రభుత్వాన్ని ఎక్కువకాలం ఉండనివ్వం.

పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలి

లేకుంటే పోరాటం ఉదృతం చేస్తాం..
పేదవాడి నడ్డి విరిచే ప్రభుత్వాన్ని ఎక్కువకాలం ఉండనివ్వం.

మధురవాడ : వి న్యూస్ ప్రతినిధి :డిసెంబర్ 23:

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఆదేశాల మేరకు భీమిలి నియోజకవర్గం జోన్ 2 పరిది 7 వ వార్డ్ మధురవాడ వద్దగల విద్యుత్ ఉపకేంద్రం వద్ద భీమిలి నియోజకవర్గం భాజపా కన్వీనర్ కంటుభుక్త రామానాయుడు ఆధ్వర్యంలో సుమారు వందమంది నాయకులు,కార్యకర్తలు ధర్నా చేపట్టారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాడి నడ్డి విరిచే ఈ ప్రభుత్వం ఎంతోకాలం ఉండదని, అన్ని రంగాల్లో ఈ ప్రభుత్వం ధరలు పెంచిందని ముఖ్యంగా పెంచిన విద్యుత్ ఛార్జిలు తక్షణమే తగ్గించాలని డిమాండ్  చేశారు. బిల్లు చూస్తేనే ప్రజలకు షాక్ కొడుతుందని ఎద్దేవ చేశారు. ఈ కార్యక్రమంలో  పసుపులేటి శ్రీనివాసరావు,  సత్యనారాయణ,ఉప్పాడ అప్పారావు, పోతిన పైడిరాజు, తాటిపూడి ప్రదీప్, ప్రసాద్ పట్నాయక్,పి ప్రదీప్,కే సునీత, మరియు పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు..