అంగన్వాడిల నిరసన సెగ సమ్మెకు మద్దకుగా డా. సందీప్ పంచకర్ల

అంగన్వాడిల నిరసన సెగ సమ్మెకు మద్దకుగా డా. సందీప్ పంచకర్ల.

భీమిలి : పెన్ షాట్ ప్రతినిధి : డిసెంబర్ 13:


భీమిలి నియోజకవర్గం భీమిలి జోన్ ఐసీడిఎస్ కార్యాలయం నందు అంగన్వాడి ఉద్యోగుల నిరసన సమ్మెకు మద్దతుగా ఉద్యోగుల పిలుపు మేరకు భీమిలి జనసేన నాయకులు రాజు నవిరి, శంకర్ నీలాపు జనసేన పార్టీ మద్దతుగా నిలబడి ఉద్యోగుల డిమాండ్ లు, సమస్యల కోసం వెంటనే *భీమిలి జనసేన పార్టీ ఇంచార్జ్ డా. సందీప్ పంచకర్ల* పిలుపునిచ్చారు. ఈ సమ్మెలో సందీప్ మాట్లాడుతూ అంగన్వాడి ఉద్యోగుల డిమాండ్ ల కోసం పవన్ కళ్యాన్ కి తెలియజేసి అన్ని విధాలుగా ఉద్యోగులకు న్యాయం జరిగేలా ఉద్యోగుల సమస్యలకై ప్రభుత్వాలతో పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమిలి జనసేన నాయకులు శాఖరి శ్రీనుబాబు, బి.వి. క్రిష్ణయ్య, సంతోష్ నాయుడు, అనిల్, కొయ్య శ్రీను, స్వరాజ్, దాసు తదితరులు పాల్గొన్నారు.