వెలమ సంఘం వన సమారాధన కు రెవిన్యూ మంత్రి ధర్మాన కు ఆహ్వానం.
మధురవాడ:వి న్యూస్ ప్రతినిధి : డిసెంబర్ 22:
మధురవాడ* : భీమిలి నియోజకవర్గం పరిధిలోని గ్రేటర్ విశాఖ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్24 ఆదివారం మధురవాడ జాతరలో నిర్వహించే వనసమారాధనకు రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తదితరులకు నాయకులు ఆహ్వానాలు అందజేశారు. ఈ
కార్యక్రమంలో గ్రేటర్ వెలమ సంఘం అధ్యక్షులు చలుమూరి నాయుడుబాబు, సంఘo ప్రధాన కార్యదర్శి దొగ్గ దుర్గాప్రసాద్, కోశాధికారి సిరపరపు గౌరీశంకర్, ఉపాధ్యక్షులు సూరెడ్డి సత్యన్నారాయణ, రంది నాయుడు ,ద్వారపురెడ్డి కృష్ణ, యువత అధ్యక్షులు దొగ్గ గణేష్, తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.