పాలసముద్రంలో ఆదిశేషు పై పవళించిన విష్ణుమూర్తి అలంకరణ
నరసాపురం: వి న్యూస్ : డిసెంబర్ 23:
ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని నరసాపురం మండలంలోని వేములదీవిపడమర కాపులకొడపలో వేంచేసివున్న వైభవ వేంకటేశ్వరస్వామికి పాలసముద్రంలో ఆదిశేషుపై పవళించిన విష్ణుమూర్తి అలంకరణ చేశారు. వేకువజాము నుంచి సహస్రనామార్చన, ప్రత్యేక, విశేష పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. భక్తులు అదిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. భజన కార్యక్రమం జరిపారు. అన్నసమారాధన చేశారు.