నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన సెవెన్ హార్ట్స్ ఎన్జీవో
కామారెడ్డి : వి న్యూస్ : డిసెంబర్ 24:
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గల ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ సెవెన్ హార్ట్స్ ఆర్గనైజేషన్ ఎన్జీవో అధ్వర్యంలో ఫరీద్ పెట్ గ్రామంలోని ఇంటర్నేషనల్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చిలో క్రిస్టమస్ వేడుకలు ఘనంగా జరిపారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి ఎన్జీవో తరఫున నిరుపేద క్రిస్టియన్ కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ రత్నం, ఎన్జీవో ఫౌండర్ జీవన్ నాయక్, ప్రతినిధులు లత, అశ్విని, రాజు, పవన్ కళ్యాణ్, రాహుల్, బ్రదర్ లక్ష్మణ్, సంఘ ప్రజలు పాల్గొన్నారు.