బేతని పాఠశాలలో ఘనంగా క్రిస్టమస్ వేడుకలు

బేతని పాఠశాలలో ఘనంగా క్రిస్టమస్ వేడుకలు

మధురవాడ : వి న్యూస్ ప్రతినిధి :డిసెంబర్ 23: 

ఏసుక్రీస్తు పుట్టిన రోజునే ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకుని, ఎంతో పవిత్రంగా భావిస్తారని. జీసస్ జన్మించి నేటికి రెండు వేల సంవత్సరాలు దాటినా కరుణామయుడుగానూ, దయామయుడుగానూ క్రెస్తవులతో ఆరాధనలను పొందుతున్నారని బేతని సంస్థల చైర్మన్, ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ పి.ఏసుపాదం అన్నారు.   మహా విశాఖ,జోన్ 2 పరిధి 6 వ వార్డు పీఎం పాలెం బేతని పాఠశాల ప్రాంగణంలో క్రిస్టమస్ వేడుకలను శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బేతని పాఠశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమములు అలరించాయి. ఈ సందర్భంగా యేసుపాదం మాట్లాడుతూ యేసు కృపతో ఎంతో మంది పేదవారికి సేవ చేసే భాగ్యం కలిగిందని అన్నారు. ప్రజలకు ప్రేమను పంచడంలో యేసుపాదం ముందుంటారని అయన ద్వారా స్థిరపడిన వారు మరో 5 గురు కి అండగా నిలవాలని దాసరి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఎంతో మందికి అండగా నిలిచినా ఆయనకు ఆ దేవదేవుని కృప ఎల్లపుడు ఉండాలని గాదె రోశిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేసారు. అనంతరం కేక్ ను కట్ చేసి మహిళలకు చీరలు, మినిస్ట్రీస్ సిబ్బందికి బట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రమోద్ చక్రవర్తి, ఐసాక్, వెంకటలక్ష్మి, రాములు, కె.డేవిడ్ విక్టర్ తదితరులు పాల్గున్నారు.