తల్లిదండ్రులపర్యవేక్షణ విద్యార్థులవిజయానికి సోపానం.!

తల్లిదండ్రులపర్యవేక్షణ విద్యార్థులవిజయానికి సోపానం.!

పాచిపెంట : వి న్యూస్ :  డిసెంబర్ 16: 

తల్లిదండ్రుల పర్యవేక్షణ విద్యార్థుల విజయానికి సోపానమని .జాయింట్ కలెక్టర్ ఆర్ గోవింద రావు అన్నారు. పాచిపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రత్యేక అధికారిగా తల్లిదండ్రులతో పాఠశాల ఆవరణలో నిర్వహించిన సమావేశంలో శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల చదువు పట్ల దృష్టి సారించాలన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు బోధన చేసి, ఆ అంశాన్ని బాగా అర్థం చేసుకోవాలని తెలియజేసారని దానిని ఇంటి వద్ద సమయం కేటాయించి నేర్చుకునే పర్యవేక్షణ తల్లిదండ్రులు చేయాలన్నారు. మార్చి 18 నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం అవుతాయని ఆయన చెప్పారు. పదవ తరగతి ప్రతి విద్యార్థికి కీలకమని, భవిష్యత్తును నిర్ణయించే అంశంగా చెప్పవచ్చని ఆయన అన్నారు. ప్రతీ విద్యార్థి పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించాలని అందుకు తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. కొద్ది సేపు పర్యవేక్షణ బాధ్యతలను తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇంకా సరిగ్గా రెండు నెలల కాలం ఉందని, వారిపై దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థులు తెలివైన వారని, ప్రోత్సాహం అందించాలని ఆయన కోరారు. 

అమ్మవలస అంగన్వాడి కేంద్రం తనిఖీ

అమ్మవలస అంగన్వాడి కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారు. అంగన్వాడీ నిర్వహణ తీరు, అంగన్వాడి పరిధిలో గర్భిణీలు, బాలింతలు, రక్తహీనత కలిగిన వారు తదితర వివరాలు పరిశీలించారు. పౌష్ఠికాహారం అందిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. 

ఈ కార్యక్రమంలో పాచిపెంట మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ లక్ష్మీకాంత్, తహసిల్దార్ రాజశేఖర్, వ్యవసాయ అధికారి తిరుపతిరావు, రైతులు పాల్గొన్నారు.