చోడవరం సబ్ రిజిస్టర్ కార్యాలయం దస్తావేజు లేకర్లు పెన్ డౌన్

చోడవరం సబ్ రిజిస్టర్ కార్యాలయం దస్తావేజు లేకర్లు పెన్ డౌన్

చోడవరం: వి న్యూస్ : డిసెంబర్ 16: 

చోడవరం మండలం సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు లేకర్లు ప్రైమ్ 2.ఓ విధానం రద్దు చెయ్యాలని పెన్ డౌన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంను ఉద్దేశించి చోడవరం దస్తావేజు లేకరి బొబ్బిలి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రైమ్ 2.ఓ విధానంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని అటు ప్రజలు, దస్తావేజు లేకర్లు,సర్వర్లు పనిచేయక 30 నిముషాలలో జరిగే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రైమ్ 2.ఓ సర్వర్లు మోరాయిస్తుండటంతో ఒక రిజిస్ట్రేషన్ కొరకు వచ్చే ఇరు పార్టీల సభ్యులు రెండు మూడు రోజులు తిరగవలసి వస్తుందని దానివల్ల ప్రభుత్వానికి రావలసిన ఆదాయం కూడా తగ్గి పోతుందని తద్వారా దస్తావేజు లేకర్లు ఒకే దస్తావేజు కొరకు 2 నుండి మూడు రోజులు కొరకు ఉండటంతో దస్తావేజు వృత్తినే జీవనాధారంగా ఉన్న మాకు, మాపై ఆధారపడి ఉన్న సిబ్బంది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని బొబ్బిలి చంద్రశేఖర్ తమ ఆవేదన వ్యక్తం చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేకర్లు పిలుపు మేరకు శనివారం చోడవరం మండల దస్తావేజు లేకర్లు పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోసూరి నారాయణరావు, శ్రీనివాసరావు, రామారావు, శ్యామ్,సీతారామయ్య, కృష్ణ, దేవన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.