యువగలం పాదయాత్రలో మీసేవ ఆపరేటర్లను ఆదుకోవాలని నారా లోకేష్ కి వినతి

యువగలం పాదయాత్రలో మీసేవ ఆపరేటర్లను ఆదుకోవాలని నారా లోకేష్ కి వినతి.

నర్సీపట్నం : పెన్ షాట్ ప్రతినిధి : డిసెంబర్ 13 :

మీసేవ సమస్యలపై యువగలం పాదయాత్ర లో నారా లోకేష్ ని ఉమ్మడి విశాఖ జిల్లా మీసేవ ఆపరేటర్లు కలిసి మీసేవ ఆపరేటర్లు ఉద్యోగాలు లేక స్వయం ఉపాధి కింద ఒక రూపాయి కూడా ప్రభుత్వానికి ఖర్చు లేకుండా సొంత పెట్టుబడులు పెట్టి మీసేవ ద్వారా ప్రభుత్వానికి కోట్ల రూపాయలు అందించేవారమణి, మీసేవ ఆవిర్భావం నుండి మీసేవ ఆపరేటర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా ప్రజలకు సేవలు అందిస్తు జీవనం సాగిస్తున్నామని, అర్దాంతరంగా వైస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యిన తరువాత సచివాలయం వ్యవస్థను తీసుకు వచ్చి జగన్ పాదయాత్రలో మీసేవ ఆపరేటర్లకు ఇచ్చిన మాటను మరచి సచివాలయంలో అడ్మిన్ పోస్టును మీసేవ ఆపరేటర్లకు ఇస్తామని మడమ తిప్పి మమ్మలను తెలుగు దేశం కార్యకర్తలు గా ముద్రవేసి మీసేవ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు క్రమ క్రమంగా సర్వీసులను తొలగించి సుమారు మమ్మలను, మా పై ఆధారపడి ఉన్న ఆపరేటర్ల 50 వేలు కుటుంబాల జీవనోభృతిని నాశనం చేశారని రానున్న సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ, జనసేన కలిసి అధికారంలోకి రావాలని మీసేవ ఆపరేటర్లు రోజులు లెక్కపెడుతున్నామని అధికారం లోకి వచ్చిన అనంతరం మీసేవ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకు వచ్చి మా కుటుంబాలకు శాశ్వత భరోసా కల్పించాలని ఉమ్మడి మీసేవ ఆపరేటర్లు కోరారు. మీసేవ ఆపరేటర్లు అభ్యర్ధనపై టీడీపీ జాతీయ కార్యదర్శి శానుకూలంగా స్పందించి కచ్చితంగా మీసేవ ఆపరేటర్లకు టీడీపీ, జనసేన కలిసి అధికారంలోకి వచ్చిన తరువాత న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు.