బాపూజీనగర్ పైడితల్లమ్మ దేవాలయంలో హుండీ కొల్లగొట్టిన దుండగులు.
మధురవాడ : వి న్యూస్ : డిసెంబర్ 11:
మధురవాడ నగరంపాలెం నుండి స్వతంత్ర నగర్ వెళ్లే మార్గం బాపూజీ నగర్ లో శ్రీ శ్రీ శ్రీ పైడితల్లమ్మ దేవాలయంలో హుండీ దొంగతనం చేసిన దుండగులు. ఈ అమ్మవారి దేవాలయంలో గత కమిటీ సభ్యులను రద్దు చేసి కొద్దిరోజుల క్రితం నూతన కమిటీ ఎన్నుకోవటం జరిగిందని నూతన కమిటీ ఏర్పాటు అయ్యిన అతి కొద్దిరోజులకే ఇలా దొంగతనం జరగడం పై నూతన కమిటీ సభ్యుల పై అసంతృప్తి తో కావాలనే ఎవరో చేసి ఉంటారని అక్కడ ఉన్న స్థానికులు వాపోతున్నారు. దొంగతనం విషయం తెలుసుకున్న పీఎంపాలెం క్రైమ్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.