తిరుమల సన్నిధిలో ధరల పట్టికలో ఉన్నది 60 రూపాయలు! వసూలు చేసేది 100 రూపాయలు.

తిరుమల సన్నిధిలో ధరల పట్టికలో ఉన్నది 60 రూపాయలు! వసూలు చేసేది 100 రూపాయలు.             

తిరుమల : వి న్యూస్ :  డిసెంబర్ 19: 

తిరుమల కొండపై సి ఆర్ ఓ కార్యాలయం వద్ద కళ్యాణ్ సత్రం పక్కన ఉన్న అమ్మ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో నిర్దేశించిన ధరల పట్టికలో ధరలు ఒకటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకులు వసూలు చేస్తున్న ధరలు ఒకటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో కొందరు కుటుంభ సభ్యులు ధరల పట్టికను చూసి సిబ్బందిని ధరల పట్టిక దరలేనా అడిగి గోబీ రైస్ 5 ప్లేట్లు, గోబీ మంచూరియా 1 ప్లేట్ తిన్నారు, తిన్న అనంతరం ధరల పట్టిక ప్రకారం 360 ఇవ్వగా 600 రూపాయలు అయ్యింది అని చెప్పటంతో ఆ కుటుంభ సభ్యులు ఒక్క సారిగా అవక్కయ్యి అదేమిటి 6 ప్లేట్లు 60 రూపాయలు చొప్పున 360 గా అని చెప్పగా కాదు 6 ప్లేట్లు, (ప్లేట్ 100) రూపాయలు చొప్పున 600రూపాయలు అయ్యింది అన్నారని ముందుగా ఒకరు 60 రూపాయలు అన్నారు అని ప్రశ్నించగా ధరల పట్టి పాతది మార్చలేదు 600 ఇవ్వవలసిందే అని అనటంతో చేసేదేమీ లేక వారితో వారించలేక 600 ఇచ్చి వెళ్ళ వలసి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసారు. డబ్బులు లేని పరిస్థితిలో ఆవిధంగా ముందు ఒక ధర తిన్న తరువాత ఒక ధర చెప్తే ఎలా అంటున్నారు. దేవాలయ అధికారులు అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని మా లాంటి కుటుంభ సభ్యులకు ఎదురైన విధంగా మరొకరికి జరగ కుండా ఉండే విధంగా చూడాలని కోరుతున్నారు.