మన పరిసరాల పరిశుభ్రత మన బాధ్యత ! స్వచ్ఛ ప్రమాణం కార్యక్రమంలో 5వ కార్పొరేటర్ మొల్లి హేమలత

మన పరిసరాల పరిశుభ్రత మన బాధ్యత ! స్వచ్ఛ ప్రమాణం కార్యక్రమంలో 5వ కార్పొరేటర్ మొల్లి హేమలత 

మధురవాడ : జీవీఎంసీ:  వి న్యూస్ :  డిసెంబర్ 22: 

5వవార్డ్ పరిధిలో గల పరదేశిపాలెం   మండల ప్రాథమిక పాఠశాల నందు జీవీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న "ECO VIZAG" ప్రోగ్రాం లో భాగంగా "స్వచ్ఛ ప్రమాణం" కార్యక్రమంలో కార్పొరేటర్ మొల్లి మేమలత ముఖ్య అతిథి గ పాల్గొని స్కూల్లో పిల్లలందరికి పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది.అనంతరం పిల్లలందరికి స్వచ్ఛ ప్రమాణ పత్రాలను అందించి పిల్లలచేత స్వచ్ఛ ప్రమాణం చేయించారు. అనంతరం కార్పొరేటర్ పాఠశాల పరిసరాలు, తరగతి గదులను సందర్శించి, పిల్లలతో ముచ్చటించారు. పిల్లల అవసరాలను తెలుసుకొని, సమస్యలు ఏమైనా ఉంటే  పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి సానిటరీ ఇన్స్పెక్టర్ కాకర శ్రీనివాసరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వరలక్ష్మి, ఉపాధ్యాయులు కుమారి, సచివాలయ అడ్మిన్ సెక్రటరీ హేమలత, ఎమిటి సెక్రటరీ శ్రావణి స్థానిక గ్రామ పెద్దలు బోర సూరిబాబు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.