ఫించన్ సొమ్ము తస్కరించిన కేసులో 41వ సచివాలయం మహిళా వాలంటీర్ అరెస్ట్, విడుదల.

ఫించన్ సొమ్ము తస్కరించిన కేసులో 41వ సచివాలయం మహిళా వాలంటీర్ అరెస్ట్, విడుదల.               

పీఎంపాలెం : వి న్యూస్ ప్రతినిధి :డిసెంబర్ 24:

పీఎంపాలెం 41వ సచివాలయంలో వెల్ఫేర్ సెక్రెటరీ ఫించన్ సొమ్మును తన టేబుల్ పై పెట్టి వాలంటీర్స్ అందచేసే సమయంలో 49,475 రూపాయలు నగదు చోరెకి గురయ్యిన ఘటన డిసెంబర్ 5వాతేదీన వెలుగులోకి వచ్చింది, ఈ ఘటనలో జోన్2 కమీషనర్ కే కనకమహాలక్ష్మి జోన్2 కార్యాలయానికి 41వ సచివాలయం సిబ్బందిని రప్పించి విచారించగా ఎవరు మాకు తెలియదు అని నోరు విప్పక పోవటంతో జోన్2 కార్యాలయంనుండి పీఎం పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసి నగదు చో్రీ విచారణ చెయ్యాలని విజ్ఞప్తి చెయ్యటంతో పీఎంపాలెం పోలీస్ స్టేషన్ సీఐ రామకృష్ణ ఆదేశాలతో నేర విభాగం ఎస్ఐ శ్రీనివాస్ సచివాలయం సిబ్బంది ని, వాలంటీర్లను విచారణ చెయ్యగా విచారణలో దుర్గభవాని నేరం అంగీకరించినట్లు తెలిపారు. ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి అనంతరం స్టేషన్ బెయిల్ పై విడుదల చేసారు.