వైస్సార్సీపీ పార్టీకి, సభ్యత్వానికి రాజీనామా చేసిన 39వ వార్డ్ కార్పొరేటర్ మొహమ్మద్ సాధిక్.
విశాఖ సిటీ : పెన్ షాట్ ప్రతినిధి : డిసెంబర్ 09:
39వ వార్డ్ కార్పొరేటర్ మొహమ్మద్ సాధిక్ వైస్సార్సీపీ పార్టీకి, సభ్యత్వానికి రాజీనామా చేసారు ఈయన ఇండిపెండెంట్ గా గెలిచి వైస్సార్సీపీలో చేరారు. శనివారం ఆయన మాట్లాడుతూ రాజీనామా వివరాలు వెల్లడించారు. ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ ఏరియాలో ఎక్కువగా ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటారని అసలు పార్టీలో ముస్లిమ్స్ కి ప్రాధాన్యత కల్పించటం లేదని, వార్డు అభివృద్ధి కి ఎమ్మెల్యే కానీ పార్టీ హై కమాండ్ సహకరించకపోవటం వల్ల రాజీనామా చేస్తున్నట్టు మీడియా సమావేశంలో తెలిపారు.