ఓ ఎస్ జి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 33వ రక్త దాన శిబిరం.
ఓ ఎస్ జి ఫౌండేషన్ నిర్వాహకులకు పలువురు ప్రశంసలు.
ఆనందపురం : వి న్యూస్ : డిసెంబర్ 24:
ఓ ఎస్ జి ఫౌండేషన్ వెంపాడ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యా శ్రీ బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఆదివారం విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గంభీరం రం పంచాయతీ ఆర్టీవో ఆఫీస్ హైవే రోడ్డు ఓ ఎస్ జి ఆర్య స్టూడియో వద్ద మెగా రక్తదానం శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరానికి స్థానికులు విద్యార్థులు వచ్చి స్వచ్ఛందంగా 29 మంది రక్తదానం చేశారు ఓ ఎస్ జి ఫౌండేషన్ కి ఇది 33వ రక్తదానం శిబిరం కాగా ఇప్పటివరకు గతంలో 1823 యూనిట్లు సేకరించారు ఆదివారం రక్తదాన శిబిరంతో కలిపి 1852కి చేరుకుంది ఈ రక్తదానం శిబిరాల్లో సేకరించిన రక్తాన్ని శుద్ధి చేసి రోడ్డు ప్రమాదాలు గుండె సంబంధిత వ్యాధులు క్యాన్సర్ పేషెంట్లకు తలసేమీయా పిల్లలకు ఇస్తారని అదేవిధంగా రక్తదాన అవగాహన ఇంకా యువతలో రావాలి రక్తం అందకుండా ఏ ఒక్క ప్రాణి కోల్పోకూడదని ఒక సద్దుదేశంతో ఈ యొక్క రక్తదానం శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని ఓ ఎస్ జి ఫౌండేషన్ శివ దళాయి పేర్కొన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ బృందం మరియు ఓ ఎస్ జి ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ ఉమామహేశ్వర్ సెక్రటరీ చంద్రశేఖర్ సురేష్ ఆర్య భాస్కర్ పండు సునీల్ గోవింద్ మరియు వెంపాడ వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.