ఋషికొండ వద్ద పోయిన ల్యాప్ టాప్ బ్యాగ్ ను 30 నిముషాలలో అందించిన పీఎంపాలెం ట్రాఫిక్ ఎస్ ఐ మురళీకృష్ణ

ఋషికొండ వద్ద పోయిన ల్యాప్ టాప్ బ్యాగ్ ను 30 నిముషాలలో అందించిన పీఎంపాలెం ట్రాఫిక్ ఎస్ ఐ మురళీకృష్ణ.

ఋషికొండ: పెన్ షాట్ ప్రతినిధి : డిసెంబర్16:

జబల్‌పూర్‌కు చెందిన విశ్వజీత్, శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు రుషికొండలోని ఏ1 గ్రాండ్‌లో ఏపీ 39 యుఎల్ 5461 గల ఆటో ఎక్కి, సాగర్‌నగర్‌లోని ఆర్ఆర్ఆర్ గ్రాండ్ హోటల్‌లో దిగి, ల్యాప్ టాప్, వ్యాలెట్‌తో కూడిన 3000 నగదుతో పాటు ఇతర డెబిట్ కార్డ్‌లతో కూడిన బ్యాగ్‌ని పొరపాటున వదిలి వెళ్లి ఆపై అతను ఏ1 గ్రాండ్‌లో తన ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పీఎం.పాలెం ట్రాఫిక్ పీఎస్ ట్రాఫిక్ ఎస్ ఐ ఆఫ్ పోలీస్, పి . మురళీ కృష్ణను సంప్రదించారు. దీనిపై ఎస్‌ఐ మురళీకృష్ణ సీసీ ఫుటేజీలను పరిశీలించి ఆటో డ్రైవర్లను విచారించి వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆటో డ్రైవర్లందరికీ సందేశం పంపారు. అరగంట తర్వాత ఎండాడ స్టాండ్‌కు చెందిన జయరామ్‌, ఆటో డ్రైవర్‌ స్పందించి ఎస్ ఐ పి . మురళీ కృష్ణ సమక్షంలో సంబంధితులకు ల్యాప్‌టాప్‌ బ్యాగ్‌ అందజేశారు. ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న తక్షణ చర్యను అందరూ అభినందించారు.