నెహ్రు యువ కేంద్ర సంఘటన్(NYKS) ఆధ్వర్యంలో మేరీ మీట్టీ మేర దేశ్

నెహ్రు యువ కేంద్ర సంఘటన్(NYKS) ఆధ్వర్యంలో మేరీ మీట్టీ  మేర దేశ్

ఆనందపురం: వి న్యూస్ : సెప్టెంబర్ 25: 

కేంద్ర ప్రభుత్వ యువజన సర్వీసులు శాఖ ఆదేశాల మేరకు అనుబంధ సంస్థ అయిన నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ మేరీ మీట్టీ మేర దేశ్ కార్యక్రమంలో భాగంగా మిట్టి కో నమన్- వీరొం కో వందన్ అనే కార్యక్రమాన్ని ఆనందపురం మండలం లొడగలవానిపాలెం గ్రామం, అలాగే ఆనందపురం పోలీస్ స్టేషన్, మండల పరిషత్ అభివృధి వారి కార్యాలయం, తహశీల్దార్ వారి కార్యాలయం, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,ఎంపీపీ పాఠశాల, lv పాలెం సచివాలయం  స్థలాలో (భీమిలీ బ్లాక్)లో  నిర్వహించడం జరిగిందనీ జాతీయ యువ వాలంటీర్ లొడగల అచ్చిబాబు తెలిపారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఇందులో భాగంగా 6000 గ్రామాల నుండి నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఇంటింటికి వెళ్లి మట్టిని,బియ్యంనీ స్వీకరించి పంచ్ ప్రాణ ప్రతిష్టను నిర్వహిస్తారని అలాగే ఢిల్లీలో నిర్వహించబోయే జాతీయ స్థాయి కార్యక్రమంలో దాదాపు 75 వేల మందితో అక్టోబర్ నెల చివరి వారంలో పాల్గొన్నబోతున్నామని అక్కడ కర్తవ్య పాత్ అనే ప్రాంతంలో జరిగే స్వామి వివేకానంద విగ్రహం వద్ద 6000 గ్రామాల నుండి సేకరించిన మట్టిని,బియ్యంనీ అక్కడ సమర్పించడం జరుగుతుందని,

ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి మట్టిని, బియ్యంనీ సేకరించడం జరుగుతుందని తెలిపారు.