భీమిలి రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య విశాఖపట్నం సభ్యులు.
భీమిలి : వి న్యూస్ సెప్టెంబర్ 23:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీపీఎస్ కి ప్రత్యామ్నాయంగా జిపిఎస్ విధానాన్ని అమలు చేయడం సమంజసం కాదని పాత ఫించన్ తప్ప సీపీఎస్ ను కానీ, జిపిఎస్ ను కానీ అంగీకరించే ప్రసక్తే లేదని రాష్ట్ర ఎఫ్ ఏ పి టీ ఓ (FAPTO) ఇచ్చిన పిలుపు మేరకు శనివారం విశాఖపట్నం జిల్లా భీమిలి రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ భాస్కర్ రెడ్డికి వినతిపత్రం అందచేశారు. ప్రభుత్వం తీరు మారకపోతే నిరసన తీవ్ర తరం చేసి దశల వారీగా సోమవారం చలో కలెక్టర్ కార్యాలయం కార్యక్రమం నిర్వహిస్తామని ఎఫ్ ఏ పి టీ ఓ (FAPTO) విశాఖపట్నం చైర్మన్ డి జోజిబాబు తెలియచేసారు. సీపీఎస్ ద్వారా ఉద్యోగ ఉపాధ్యాయుల నోట్లో మట్టి కొట్టే జిపిఎస్ విధానాన్ని తక్షణమే రద్దు చెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.