క్రీడా స్ఫూర్తితో మొదలైన రాష్ట్రస్థాయి గ్రాఫ్టింగ్,రెజ్లింగ్ పోటీలు పోటీలు.
వి న్యూస్: మధురవాడ: సెప్టెంబర్ 24:
చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణం వేదికగా ఆదివారం రాష్ట్రస్థాయి గ్రాఫ్టింగ్,రెజ్లింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా బాస్కెట్ బాల్ అధ్యక్షులు, ఎన్.ఐ.ఎఫ్.ఎస్. సి.ఈ.ఓ, సునీల్ మహంతి, విశాఖ జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ చైర్మన్,రిటైర్డ్ ఎడిషనల్ ఎస్పీ టి.ఎస్.ఆర్ ప్రసాద్,రాష్ట్ర గ్రాఫ్టింగ్,రెజ్లింగ్ సంఘ అధ్యక్షులు ఎం.సురేంద్రరెడ్డి, సి.ఐ.బాలకృష్ణ,హజరత్ ముక్తియోర్ అలీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఎం.డి. అహ్మద్,విచ్చేసారు.రాష్ట్రస్థాయి గ్రాఫ్టింగ్,రెజ్లింగ్ పోటీలకు రాష్ట్రంలో 13జిల్లాల నుంచి 250మంది బాల,బాలికలు ఈ పోటీలకు హాజరయ్యారు.కార్యక్రమంలో జిల్లా బాస్కెట్ బాల్ అధ్యక్షులు సునీల్ మహంతి మాట్లాడుతూ..ప్రతి మనిషి జీవితంలో క్రీడలు దైనందిక జీవితంలో దోహదపడతాయని అన్నారు. విద్యార్థిదశలో క్రీడాకారులు వాస్తవిక దృక్పధం,లక్ష్యం, నాలెడ్జ్ ప్రతీ యువతీ యువకులకు అవసరమని, అపజయల నుంచి పాఠం నేర్చువాలని,నిరాశ,నిశ్చృహ వంటి వాటిని విడనాడాలని, గొప్పవ్యక్తులు చెప్పే మాటలు విని ప్రేరణ పొందాలని,విద్యార్థి దశ నుంచే ఆటల పట్ల ఆసక్తిని పెంపొందించుకొని,నైపుణ్యంతో క్రీడల్లో రాణించాలన్నారు. టి.ఎస్.ఆర్ ప్రసాద్ మాట్లాడుతూ క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు, మానసిక ఉల్లాసం వృద్ధి చెందుతుందన్నారు. సాంప్రదాయకమైన ఆటలు ప్రపంచగుర్తింపుగల క్రీడల్లో ప్రావీణ్యము సంపాదిస్తే,పేరు, ప్రతిష్ఠలతో పాటు మంచి ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయని తెలిపారు.పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోను ఆయా క్రీడల్లో విద్యార్థులు రాణిస్తున్నారని అన్నారు. అనంతరం ముఖ్య అతిథులు గ్రాఫ్టింగ్,రెజ్లింగ్ క్రీడలో పాల్గొంటున్న క్రీడాకారులకు అభినందనలు తెలుపుతూ పోటీలను ప్రారంభించారు. ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాజబాబు,పాఠశాల కమిటీ చైర్ పర్సన్ బుడుమూరి మీనా,అనూష కేటరింగ్స్ పోతిన ప్రసాద్,ఏపీ గ్రాఫ్టింగ్ అసోసియేషన్ నిర్వహణ కార్యదర్శి పేడాడ మురళీ,జిల్లా అధ్యక్షులు బగాది జగదీశ్వరరావు,కోశాధికారి బి.రామచంద్రరావు,ఫిజికల్ డైరెక్టర్ పెంటకోట రాము తదితరులు పాల్గొన్నారు.