దాకమర్రి రఘు కళాశాలలో ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ పై జాతీయ సదస్సు

దాకమర్రి రఘు కళాశాలలో  ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ పై జాతీయ సదస్సు 

దాకమర్రి : భీమిలి :  వి న్యూస్  సెప్టెంబర్ 23:   

భీమునిపట్నం దాకమర్రి గ్రామం రఘు కాలేజ్  ఆఫ్ ఫార్మసీలో శనివారం “ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ మరియు రీసెర్చ్‌లో మార్పుల నమూనా – NEP 2020” అనే అంశంపై ఒక రోజు జాతీయ సెమినార్ జరగనుంది.  ఇండియన్ ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖతో కలిసి సెమినార్ ను నిర్వహిస్తున్నారు. జాతీయ సెమినార్‌లో ఫార్మసీ రంగంలో ప్రసిద్ధి చెందిన ప్రముఖుల బృందం ముఖ్య వక్తలుగా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా (IPGA) జాతీయ అధ్యక్షులు, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈసీ సభ్యుడు, సుజీత్ యూనివర్శిటీ  ప్రో-ఛాన్సలర్ డాక్టర్ అతుల్ కుమార్ నాసా, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎడ్యుకేషన్ రెగ్యులేషన్ కమిటీ చైర్మన్, ఐపీజీఏ ఉపాధ్యక్షులు డాక్టర్ దీపేంద్ర సింగ్, ఏ యూ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్,   రిటైర్డ్  ప్రిన్సిపాల్, సీనియర్ ప్రొఫెసర్  కే .వి .  రమణ మూర్తి,  తదితర ప్రసిద్ధ వక్తలు  ఈ సెమినార్‌కు హాజరు కానున్నారు. జాతీయ సెమినార్‌కు రఘు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కలిదిండి రఘు చీఫ్ ప్యాట్రన్ గా వ్యవహరించనున్నారు.

సెమీనార్ కన్వీనర్లుగా రఘు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ డాక్టర్ జగదీష్ పాండా, ఏపీ స్టేట్ బ్రాంచ్ ఐపీజీఏ అధ్యక్షుడు ఎ.విజయభాస్కర్ రెడ్డి, కో కన్వీనర్స్ గా డాక్టర్  కె . పూర్ణా నాగశ్రీ, డాక్టర్ కె పద్మజా  వ్యవహారిస్తున్నారు . జాతీయ సెమినార్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని కళాశాలల నుండి సుమారు 800 మంది ప్రతినిధులు  హాజరుకానున్నారు.  ఈ సెమినార్లో ఫార్మాస్యూటికల్ సైన్సెస్ రంగంలో వారి పరిజ్ఞానాన్ని నవీకరించడానికి నిపుణులతో సంభాషించడానికి మరియు వారి అభిప్రాయాలు మరియు ఆలోచనలను మార్పిడి చేసుకోవడానికి ప్రతినిధులకు ఒక వేదికను అందిస్తుందని రఘు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ డాక్టర్ జగదీష్ పాండా తెలిపారు.