తెలుగు శక్తి ఫిర్యాదు స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్
కేసు నెంబరు 133580/CR/2023
రాష్ట్రంలో మానవ హక్కులకు విఘాతం
సెక్షన్ 144, సెక్షన్ 30 లతో ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం
రాష్ట్ర సరిహద్దులలో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరింపు
రాష్ట్రంలో పరిస్థితులను అధ్యయనం చేసేందుకు పర్యటించాలని విజ్ఞప్తి
తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్
ఢిల్లీ : వి న్యూస్ : సెప్టెంబర్ 25:
ఢిల్లీ : వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘనలు గతంలో ఎన్నడూ లేని విధంగా కొనసాగుతున్నాయని .. తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్ కార్యాలయానికి చేరుకున్న రామ్ తన ఫిర్యాదును అందజేస్తూ రాష్ట్రంలో పరిస్థితులను వివరించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో సెక్షన్ 144, సెక్షన్ 30 అమలు చేస్తూ ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర సరిహద్దులలో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించడం ద్వారా దేశ సరిహద్దులు మాదిరిగా మార్చి వేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులలో వాస్తవానికి తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లోనూ జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం పర్యటించాలని విజ్ఞప్తి చేశారు.
తెలుగు శక్తి ఫిర్యాదు స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్, కేసు నెంబరు 133580/CR/2023 నమోదు చేశారు.
బాబుతో నేను అంటూ విదేశీయులు మద్దతు
గాంధీజీ మార్గంలో పోరాటం చేయాలి తెలుగు శక్తి పిలుపు
మహాత్మా గాంధీ సమాధి రాజ్ ఘాట్ ను తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ దర్శించుకుని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ ఏ విధంగా శాంతియుత పోరాటం చేశారో.. ఆంధ్రప్రదేశ్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు అహింసా మార్గంలో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ కన్న కలలను వైయస్ జగన్మోహన్ రెడ్డి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా మహాత్మా గాంధీకి అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో.. అదే విధంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయన్నారు. అయితే చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేయడం పట్ల మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోందన్నారు. పలువురు విదేశీయులు కూడా వి ఆర్ విత్ యు చంద్రబాబు (బాబుతో నేను అంటూ) సంఘీభావాన్ని తెలియజేస్తున్నారని రామ్ పేర్కొన్నారు.