మధురవాడ పి ఎ సి ఎస్ ని కాపాడండి - సంఘం సభ్యులు, అఖిలపక్ష పార్టీల నేతలు

మధురవాడ పి ఎ సి ఎస్ ని కాపాడండి - సంఘం సభ్యులు, అఖిలపక్ష పార్టీల నేతలు.

మీ సంఘానికి ఎటువంటి నష్టం జరగనివ్వను - భీమిలి శాసనసభ్యుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టమైన హామీ

మధురవాడ: వి న్యూస్ : సెప్టెంబర్ 24: 

మధురవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పి ఎ సి ఎస్) ఇటీవలే నూతనంగా నిర్మించుకున్న అత్యంత విలువైన భవన సముదాయం కూల్చివేసి ఆ స్థలంలో పెట్రోల్ బంక్ నిర్మించాలని సహకార శాఖ అధికారులు చేస్తున్న ప్రతిపాదనలు అడ్డుకొని సంఘాన్ని కాపాడాలని సంఘం సభ్యులు, అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులు ఆదివారం ఉదయం భీమిలి శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు నివాసానికి వెళ్లి వినతిపత్రం అందచేశారు.

శానుకూలంగా స్పందించిన ఎం ఎల్ ఎ గారు నా నియోజకవర్గంలో నా దృష్టిలో పెట్టకుండా నాకు తెలియకుండా ఇటువంటి అనాలోచిత నిర్ణయాలు మిమ్మల్ని ఎవరు చెయ్యమన్నారు. మధురవాడ పి ఎ సి ఎస్ ని అందరూ కలిసి కట్టుగా అభివృద్ధి చేసుకుంటున్నారని ఇది ఆ ప్రాంత ప్రజలు సెంటిమెంట్తో ముడిపడి ఉన్న అంశమని అక్కడే ఉన్న విశాఖ సహకార శాఖ డిప్యుటీ రిజిస్టార్ పై మండిపడ్డారు. ఫోన్ లో జిల్లా డి సి ఓ తో మాట్లాడి సంఘానికి నష్టం వచ్చే ఎటువంటి ప్రతిపాదనలు ఎట్టి పరిస్థితులలోను చెయ్యరాదని ఆదేశించి ఇచ్చిన వినతిపత్రానికి అనుబందంగా కవరింగ్ లెటర్ రాసి అక్కడే ఉన్న డి ఆర్ కి ఇచ్చి ఇక్కడితో అన్ని ప్రతిపాదనలు వెంటనే విరామించుకోవాలని ఆదేశించారు.

గడిచిన నాలుగు సంవత్సరాలనుండి జరుగుతున్న సొసైటీ మహాజన సభలలో సొసైటీని క్రెడిట్ సోసైటీగా మార్పు చెయ్యాలన్న ఏకగ్రీవ తీర్మానాలను కూడా అధికారులు తొక్కిపెడుతున్నారని ఎం ఎల్ ఎ ద్రుష్టికి తీసుకెళ్లగా సమస్య పరిష్కారానికి శానుకూలంగా స్పందించారు.

ఎం ఎల్ ఎ ని కలిసిన వారందరు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు, అఖిల పక్ష పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.