'మేము సైతం' రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన జెసి నవీన్
- కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో 100 మంది విద్యార్థినిలు రక్తదానం
- అమ్మాయిలను స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకు రావాలి
- అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఎం. నవీన్
శ్రీకాకుళం -వి న్యూస్ సెప్టెంబర్ 23:
స్థానిక ఎల్ఐసి కార్యాలయం ప్రక్కన ఉన్న కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో రక్త దాన శిబిరాన్ని జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ , రెడ్ క్రాస్ చైర్మన్ పి. జగన్మోహన్ రావు ప్రారంబించారు. కళాశాల డైరెక్టర్ బిఎస్ చక్రవర్తి, ప్రిన్సిపాల్ కె. శివశంకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జెసి నవీన్ విద్యార్థినిలను ఉద్దేచించి మాట్లాడుతూ యువత అపోహాలు వీడి ఈ విధ్యార్ధినిలుని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. రక్తదానం చేయడంతో ఆరోగ్య సమస్యలు రావని, నూతనోత్సాహంతో ఉంటారని, పురుషులు కూడా రక్త దానానికి వెనుకడుగు వేస్తున్న తరుణంలో కూడా, పురుషులకు ధీటుగా సుమారు వంద మంది అమ్మాయిలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ రక్తపు సిరాను అందించటం వర్ణితారాహిత్యమన్నారు. అనంతరం రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో రక్త నిల్వల కొరత అధికంగా ఉందని ఇలాంటి తరుణంలో కాకినాడ ఆదిత్య యాజమాన్యం ముందుకు రావడం గర్వకారణమన్నారు. చక్రవర్తి, శివశంకర్ లు మాట్లాడుతూ విద్యతో పాటు సేవలు లో కూడా మా విధ్యార్ధినిలు ముందుంటారని, ఎన్.ఎస్.ఎస్ లో భాగంగా ఈ మహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టటం ఆనందదాయకమన్నారు. ఈ సందర్భంగా ఆదిత్య కళాశాల అధినేత డా. ఎన్. శేషారెడ్డి, సెక్రటరీ డా. సుగునా రెడ్డి, అకడమిక్ డైరెక్టర్ డా. బి.ఈ .వి.ఎల్ నాయుడు లు రక్తపు బొట్టును అందించిన విద్యార్థులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జాతీయ యువజన అవార్డు గ్రహీత పెంకి. చైతన్య, జీవితకాల సభ్యులు చిన్మయ రావు, కే. సత్యన్నారాయణ, సుజాత, పవన్, కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల జాతీయ సేవా పధకం పిఓ మజ్జి శ్రీనివాసరావు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు మదర్స్ లవ్ ఫౌండేషన్, సిక్కోలు స్వచ్ఛంద సేవ సమితి, ఆదిత్య ఈవెంట్స్, మదర్స్ హెల్పింగ్ సొసైటీ సభ్యులు, సెట్ శ్రీ మేనేజర్ అప్పల నాయుడు, అసిస్టెంట్ మేనేజర్ రమణ, కళాశాల అధ్యాపకులు ,విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.