వెల్లంకి బిజేపి పార్టీ కార్యాలయంలో శ్రీ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి
వెల్లంకి:వి న్యూస్ : సెప్టెంబర్ 25:
భారతీయ జనతా పార్టీ ఆనందపురం మండలం శాఖ ఆధ్వర్యంలో ఆనందపురం మండలంలో గల వెల్లంకి బిజేపి పార్టీ కార్యాలయంలో శ్రీ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిజేపి మండల పార్టీ అధ్యక్షులు మీసాల రాము నాయుడు,విశాఖ జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్,విశాఖ జిల్లా మహిళా మోర్చ ఉపాధ్యక్షురాలు యోలూరు ధర్మవతి మాట్లాడుతూ అంత్యోదయ ప్రదాత సిద్ధాంతకర్త పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్పూర్తితో మనమందరం పనిచేయాలి అని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బిజేపి నాయకులు,పి.జాని కేశ్వరావు,బోర శ్రీను,బోర శ్రీ, మరియు బిజేపి కార్యకర్తలు పాల్గొన్నారు.