ఏసీబీ అధికారులకు చిక్కిన పీకే గూడెం విఆర్వో చింతాడ సత్యనారాయణ.
నాతవరం: వి న్యూస్ : సెప్టెంబర్ 25:
నాతవరం: రైతు నుంచి లంచం తీసుకుంటూ నాతవరం మండల రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ అధికారులకు ఆ మండలంలోని పీకే గూడెం వీఆర్వో చింతాడ సత్యనారాయణ పట్టుబడ్డారు. రెవెన్యూ పరంగా చేయాల్సిన పనులకు లంచం డిమాండ్ చేయగా 2వేల రూపాయలు ఇప్పటికే విఆర్ఓ కి ఫోన్ పేలో చెల్లించగా మరో 2వేల రూపాయలను నాతవరం తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్వోకి ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పీకే గూడెం వీఆర్వో చింతాడ సత్యనారాయణను పట్టుకున్నారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ శ్రావణి, డిఎస్పి రమ్య ఇతర అధికారులు మెరుపు దాడి చేసి వీఆర్వో సత్యనారాయణ ను సోమవారం సాయంత్రం నాతవరం రెవిన్యూ కార్యాలయంలో పట్టుకోవడం విశేషం. మండలంలో రెవెన్యూ పనులకు లంచాలు గొడవ ఎక్కువగా ఉందన్న ఆరోపణలు మేరకు రైతు రెడ్డి సన్యాసినాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు నిఘా వేసి వీఆర్వో సత్యనారాయణ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి సత్యనారాయణ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నామని అడిషనల్ ఎస్పీ శ్రావణి తెలిపారు.