మా భవిష్యత్ మీరే చంద్రన్న: ఐదోవార్డ్ స్వతంత్ర నగర్ యువత
చంద్రబాబు అక్రమ అరెస్టు ఖండిస్తూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి సంఘీభావం తెలిపిన ఐదో వార్డులో యువత
స్వతంత్ర నగర్: వి న్యూస్ : సెప్టెంబర్ 26:
చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగ మంగళవారం స్వతంత్ర నగర్ కాలనీ యువత పసుపు టీ షర్ట్లు ధరించి స్వచ్ఛందంగా ఐదో వార్డ్ లో గల టిడిపి ఆఫీసు నందు టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు ని కలిసి సంఘీభావం తెలియజేయడం జరిగింది. అనంతరం లక్ష్మణరావు మాట్లాడుతూ మన నాయకుడు చంద్రబాబు ఆ భగవంతుని దయ వలన తొందరలోనే కడిగిన ముత్యం లాగా బయటకు వస్తారని మీ భవిష్యత్ కు ఆయన మంచి బాట వేస్తారని మీరెవరు అధైర్య పడవద్దని మనందరికీ మంచి రోజులు వస్తాయని చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తాడని,అలాగే యువత కు మెరుగైన ఉపాధి కల్పించి మీ భవిష్యత్ కు మంచి బాట వేస్తారని తెలిపారు.