మల్లయ్యపాలెం గ్రామంలో పర్యటించిన భీమిలి జనసేన నాయకులు.
మధురవాడ : వి న్యూస్ సెప్టెంబర్ 23 :
భీమిలి నియోజకవర్గం 7వ వార్డ్ మల్లయ్యపాలెం గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్య 7వవార్డ్ జనసేన నాయకులు దృష్టికి రావడంతో శనివారం మల్లయ్యపాలెం గ్రామంకి జనసేన నాయకులు వెళ్లి ప్రజలను నేరుగా కలిసి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యను అడిగి తెలుసుకుని ఈ సమస్యను వీలైనంత తొందరలో పరిష్కరించే విధంగా జనసేన తరపున ప్రయత్నం చేస్తామని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగినది.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బి వి కృష్ణయ్య,నాగోతి నాయడు,పిళ్ళా శ్రీనివాస్ రావు,పోతిన తిరుమల రావు, మల్లయ్యపాలెం గ్రామ జనసేన నాయకులు మరియు 7వ వార్డ్ జనసేన నాయకులు పాల్గొన్నారు.