5వ వార్డులో గణనాధుని పందిళ్ళలో అన్నసంతర్పణ కార్యక్రమాలు.
ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసాద వితరణ చేసిన టి.డి.పి.రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి మొల్లిలక్ష్మణరావు.
మధురవాడ : వి న్యూస్ : సెప్టెంబర్ 25:
మధురవాడ: జీవీఎంసీ జోన్-2 మధురవాడ 5వార్డుల పరిధిలో వినాయక చవితి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. శారదానగర్,రాజీవ్ గృహకల్ప న్యూకాలనీ,సద్గురు సాయినాథ్ కాలనీ,స్వతంత్రనగర్,ప్రాంతాలలో నిర్వహించిన భారీ అన్నసంతర్పణలకు టిడిపి రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు, టిడిపి విశాఖ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు వాండ్రాశీ అప్పలరాజు,బోయి వెంకట రమణ(శ్రీను),భీమిలి టిడిపి బీసీ సెల్ అధ్యక్షులు నమ్మి శ్రీను,టిడిపి వార్డు ప్రధాన కార్యదర్శి ఈగల రవికుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసాదవితరణ నిర్వహించారు. ఈసందర్భంగా రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు మాట్లాడుతూ..తొలి పూజ్యుడు గణనాథుడిని దర్శించుకుంటే ఎటువంటి ఆటంకాలు కలగవని అన్నారు.వార్డులో యువత ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషమని, పదిమందికి ఆకలి తీర్చే కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వలన ఆభగవంతుడు మనల్ని ఎల్లవేళలా కాపాడుతాడని తెలిపారు.సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత అగ్రస్థానంలో నిలుస్తు ముందుకు నడవాలని, అందుకు తమసహాయ సహకారాలు ఎప్పుడూ మెండుగా ఉంటాయని తెలియజేశారు,ముఖ్యంగా యువత తమ కాలనీల అభివృద్ధికి తోడ్పడాలని,సామాజిక సత్ప్రవర్తనతో.. మెలగాలని,స్థానిక యువతను కోరారు.వివిధ కాలనీల ప్రజలు గణనాధుని అన్నసంతర్పణ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సేవాసంఘంల నాయకులు దేవర శివ,ఆనందరావు,ఈగల అప్పలనాయుడు,నరేంద్ర,కెల్లా అప్పలరాజు,లక్ష్మణరావు, సునీత,రాజు, రమణ,నమ్మివాసు,ఇయ్యపు నాయుడు,ఓలేటి శ్రవణ్ ,తదితరులు పాల్గొన్నారు.