విద్యుత్ బిల్లులు తగ్గించాలి! సెప్టెంబర్ 27 న విశాఖ ఎ పి ఇ పి డి సి ఎల్ వద్ద నిరసన

విద్యుత్ బిల్లులు తగ్గించాలి!  సెప్టెంబర్ 27 న విశాఖ ఎ పి ఇ పి డి సి ఎల్  వద్ద నిరసన

మంగళవారం జీవీఎంసీ 5 వ వార్డు నగరంపాలెం, అయోధ్యనగర్ తదితర ప్రాంతాల్లో సిపిఐ ప్రచారం

నగరంపాలెం : వి న్యూస్ : సెప్టెంబర్ 25: 

పెంచిన విద్యుత్ చార్జీలు, ట్రూ అప్ చార్జీలు వెంటనే రద్దు చెయ్యాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం జీవీఎంసీ 5 వ వార్డు పరిధిలో నగరంపాలెం, అయోధ్యనగర్ తదితర ప్రాంతాల్లో సిపిఐ కార్యకర్తలు కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు.

ఈ ప్రచారంలో పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు మాట్లాడుతూ 

ట్రూ అప్ చార్జీలు, సర్దుబాటు చార్జీలు ఇతర భారాలు రద్దు చేయాలి.

గతంలో వాడుకున్న కరెంటుకు తదుపరి భారం వేసే విధానాన్ని రద్దు చేయాలి.

స్మార్ట్ మీటర్ల బిగింపు నిలిపివేయాలి.

వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును కొనసాగించాలి.

ఎస్సీ, ఎస్టీ, వృత్తిదారులకు ఎక్కడ నివసిస్తున్నా 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్తు రాయితీని అందించాలి

200 యూనిట్లు లోపు వినియోగించే పేదలందరికీ ఉచిత విద్యుత్ అందించాలి.

విద్యుత్ సవరణ బిల్లు - 2022ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఐ నాయకులు వి సత్యనారాయణ, జి వేళంగినిరావు, ఎం ఎస్ పాత్రుడు, ఎన్ త్రినాధ్, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.