స్పందనలో జోన్2 కమీషనర్ కే కనకమహాలక్ష్మి కి మంచి నీటి సమస్య పరిష్కరించాలని జనసేన నాయకులు విజ్ఞప్తి
మల్లయ్యపాలెం :వి న్యూస్ : సెప్టెంబర్ 25:
భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ సందీప్ పంచకర్లనాయకత్వంలో జనసేనపార్టీని బలపరచడంలో భాగంగా ఆదివారం 7వ వార్డ్ మల్లయ్యపాలెంలో స్థానిక జనసేన నాయకులు గంగరాజు ,శంకర్ నాయకత్వంలో గ్రామప్రజలు సమస్య పరిష్కారంకి మేముసైతం అంటూ ముందుకు వచ్చి ఇచ్చే వినతిపత్రంనకు సంతక సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు వారి సమస్యను తెలియజేయడం జరిగింది. సోమవారం స్పందనలో జోన్2 కమీషనర్ కే కనకమహాలక్ష్మి కి ఒమ్మి శ్రీదేవి యాదవ్ సమస్యను విపులంగా వివరించి పరిస్కారం అయ్యేవరకు ప్రత్యామ్నాయ పరిష్కారంగా వాటర్ టాంకర్స్ పెట్టమని సహకరించగలరని కోరడమైనది.మేము మీ సమస్యలు పరిస్కారం అయ్యేవరకు మీతో జనసేన ఉంటుందని మల్లయ్యపాలెం మహిళలకు భరోసా కల్పించి స్థానిక నాయకుల ఆధ్వర్యంలో సమస్యల కోసం పోరాడుతాము అని తెలుపడం జరిగింది.