హనుమాన్ దళ్ వారి ఆధ్వర్యంలో హరిజనవాడలో 150 మంది విద్యార్థులచే బాల గణపతి పూజ..

హనుమాన్ దళ్ వారి ఆధ్వర్యంలో హరిజనవాడలో 150 మంది విద్యార్థులచే బాల గణపతి పూజ...

కాకినాడ : వి న్యూస్  సెప్టెంబర్ 23:

కాకినాడ జిల్లా పెదపూడి మండల కేంద్రం అంబేద్కర్ కాలనీ హరిజనవాడలో మొదటి సారి హనుమాన్ దళ్ వారి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రులు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

అంబేద్కర్ కాలనీలో హరిజనవాడలో నెలకొల్పిన గణపతి విగ్రహం వద్ద వినాయక చవితి వేడుకలలో భాగంగా 150 మంది విద్యార్థులచే బాల గణపతి పూజ నిర్వహించారు.హనుమాన్ దళ్ ఉప కార్యదర్శి మేడపాటి గోపాల కృష్ణ,శివ సుబ్రహ్మణ్యం,పైల ప్రసాద్,రంధి సత్యనారాయణ,ప్రధానార్చకులు రామనాధ కాశ్యప్ మరియు హరిజన సోదరులు ఆధ్వర్యంలో గణపతి పూజ,గరిక పూజ నిర్వహించారు.వినాయకుడికి పుస్తకాలు, పలక,పెన్నులతో అభిషేకం నిర్వహించారు.వినాయకుడు పాదాల చెంత ఉంచిన పుస్తకాలు పెన్నులు విద్యార్థులకు హనుమాన్ దళ్ అధ్యక్షులు గణేష్ కన్నా చేతుల మీదుగా పంపిణి చేశారు.

ఈ సందర్బంగా అర్చకులు మాట్లాడుతూ ముఖ్యంగా విద్యార్థులు కొలిచితే వారికి మేధోసంపత్తి చేకూరుతుంది.గణనాధుని రూపం మానవాళికి గొప్ప తత్త్వాన్ని బోధిస్తుంది అని అన్నారు.

హనుమాన్ దళ్ అధ్యక్షులు గణేష్ కన్నా మాట్లాడుతూ ఈ సృష్టితో వినాయకుడికి ఉన్న మాతృభక్తి మరెవరికీ లేదన్నారు.ఇంటికి కాపలాకాయమంటే..సాక్షాత్తు శివుడే వచ్చినా అనుమతివ్వని వాడు కానీ పార్వతీ దేవి తండ్రిగా శివుడి గురించి చెప్పగానే ఎనలేని భక్తి శ్రద్ధలు చూపడం మొదలుపెట్టాడు.అది చాటడానికే తల్లిదండ్రుల చుట్టూ తిరిగి..భూప్రదక్షిణ చేసినంత ఫలితం పొందాడు అని అన్నారు.

అనంతరం విద్యార్థులకు,భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందించారు.ఈ కార్యక్రమంలో చిన్నారుల తీన్మార్ అలరించింది.తీన్మార్  డాన్స్‌లు  చేస్తూ గణేష్ ఉత్యవాలు కన్నుల పండుగగా జరిగింది.తీన్మార్ అద్భుతమైన వాయిద్యాలు మోత మోగించారని చిన్నారులను హనుమాన్ దళ్ అభినందించింది.