రోజ్ గార్ మేళాల లక్ష్యం 10 లక్షల మందికి ఉపాధి - కేంద్ర సహాయ మంత్రి నారాయణ స్వామీ

రోజ్ గార్ మేళాల లక్ష్యం 10 లక్షల మందికి ఉపాధి - కేంద్ర సహాయ మంత్రి నారాయణ స్వామీ

(తాటి చెట్ల పాలెం  - విశాఖ ఉత్తర) వి న్యూస్ : సెప్టెంబర్ 26:

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ దేశం విశేష అభివృద్ది సాధిస్తుందనీ కేంద్ర సాంఘిక న్యాయం,సాధికారతశాఖ సహాయ మంత్రి 

మంత్రి నారాయణ స్వామీ అన్నారు. విశాఖ లోని కైలాస పురం లో గల సాగర మాల కన్వెన్షన్ సెంటర్ లో మంగళ వారం జరిగిన 9 వ రోజ్ ఘార్ మేళా ను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. 

ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ,దేశ వ్యాప్తంగా 51 వేల మందికి పై గా 45 ప్రాంతాల్లో నియామక పత్రాలు అందజేస్తున్నారు. 

దేశంలో  మూడో అతి పెద్ద విభాగం తపాలా శాఖ అన్నారు. చంద్రయాన్ విజయవంతం తో ప్రపంచ దేశాలు భారత్ దేశం వైపు చూస్తున్నాయి అన్నారు. ఇది ఇంజనీర్లు, శాస్త్ర వేత్తలు విజయంగా అభివర్ణించారు. ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలవాలి అని ఆకాంక్షించారు.

చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత బీజేపీదే అన్నారు. పీ ఎం విశ్వ కర్మ యోజన పథకం చిన్న వృత్తి కళాకారులకు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. ఎస్సీ ఎస్టీ లకు కూడా ఉపయోగ పడుతుంది అన్నారు. ఉపాధి కల్పన కు ప్రధాని మోడీ ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నారు. ఈ ఏడాది చివరి నాటికి 10 లక్షల మందికి ఉపాధి కల్పన లక్ష్యం గా వుంది అన్నారు.

ఆంధ్ర ప్రదేశ్  తపాలా శాఖ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బీ.రాములు మాట్లాడుతూ, విశాఖలో

163 మందికి ఆరు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు వచ్చాయి అన్నారు. తపాలా శాఖలో 119 ఉద్యోగాలు వచ్చాయి అన్నారు. 

ఇప్పటి వరకు 8 రోజ్ ఘర మేళాలు జరిగాయి అని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో కస్టమ్స్ చీఫ్ కమిషనర్ రుషి గోయల్,

జీ ఎస్ టి చీఫ్ కమిషనర్ ఎం ఆర్ ఆర్.రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ప్రధాన మంత్రి వీడియో సందేశం తిలకించారు. 

అనంతరం కేంద్ర మంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు.